ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం ఆహ్వానం

జూన్ 5వ తేదీ 2026 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ వారు మరియు నేచర్ గార్డెన్స్ వారు సంయుక్తంగా కలిసి ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం విశాఖపట్నం, గాజువాక లోని ది గాజువాక క్లబ్ నందు నిర్వహించబడుతున్నది.
ఈ కార్యక్రమం లో PSSM ప్రముఖ మాస్టర్స్ చేత ధ్యానం ఎలా చేయాలి? ధ్యానం వలన కలిగే లాభాలు వివరించడం జరుగుతుంది.అనంతరం మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ పర్యావరణ కాలుష్యం గురించి అంటే ఈ కాలుష్యం తగ్గించటం కోసం మనం ఏమి చేయాలి. మన నిత్య జీవితం లో మొక్కల ఆవశ్యకత ఎంత ఉంది. మొక్కల యొక్క ప్రాముఖ్యత గురించి వివరించడం , మనం ఎటువంటి మొక్కలు నాటాలి,వాటిని ఎలా సంరక్షించాలి, అలాగే మిద్దె తోట గురించిన వివరాలు అనగా మనం రోజూ తినే కూరగాయలు,ఆకుకూరలు మన ఇంటిలోనే ఎలా పెంచుకోవాలి, ఆరోగ్యకరమైన ఆహారం తినడం కోసం మనం ఏమి చేయగలము అన్న అంశాల గురించిన జ్ఞానాన్ని మనకు అందించడం జరుగుతుంది. అలాగే కార్యక్రమం అనంతరం అక్కడికి విచ్చేసిన వారికి మొక్కలను అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంత గొప్పగా నిర్వహించుకోవడానికి చాలా మంది మనకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. మీలో ఎవరు అయినా మీ సహాయం అందించాలి అంటే 9866066980 నంబర్ ను సంప్రదించగలరు. 🙏🙏

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *